Thursday, 12 June 2014



................

పుట్టపర్తి వారి భక్తి కృతి......
కడకు మిలిగేది ఇది ఒకటే, ఎడద జపించిన భగవన్నమము..కడకు...
అష్టైశ్వర్యములమరిన గాని...ఆచారమ్ములు నెరపినగాని,
అఖిలశాస్త్రములు చదివినగాని..ఆహాయను యశమమరిన గానీ ......కడకు....
హఠ యోగమ్ములు పట్టినగానీ, ఆశ్చర్యంబులు చూపినగానీ,
అతివల కన్నుల క్రీనీడలలో ఆత్మార్పణములు చేసినగానీ......కడకు...
ఆకాశంబులు గెలిచిన గానీ, అబ్ధి జలము శొధించిన గానీ.
చంద్రలోకమున కేగినగానీ, సకలజగము తానేలిన గానీ.....కడకు..
ఈ పాటను హైదరాబాద్ సోదరీమణులుగా విఖ్యాతులైన లలిత, హరిప్రియలు 'పాలగుమ్మి విశ్వనాధంగారి సంగీత నిర్వహణలో పాడినారు... భగవదుపాసన కు సరైన అర్థం అందించే ఈ పాట, భక్తిరంజనిలో సుప్రసిద్ధం..శ్రిమతి  వసుంధరగారికి చాలా ఇస్టమైన ఈ సాహిత్యం మీ అందరికోసం కూడా....

 
 

No comments:

Post a Comment