Monday, 12 February 2018

నటరాజుకు నతులు

నటరాజుకు నతులు
http://www.teluguone.com/sahityam/content/siva-tandavam-1716.html










వాక్శుద్ధికీ వాక్సిద్ధికీ ఇవిగో నాల్గు పద్యాలు !
టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో 
త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, ""కారనుత బసవేశ పాహిమాం!

డమరుగజాత  డండడ మృడండ  మృడండ  మృడండ  మృండ మృం
డమృణ  మృడండ డండ మృణ డండడ డండ మృడండ మృండమృం
డమృణ  మృడండ డంకృతి  విడంబిత ఘూ(ghoo)ర్ణిత  విస్ఫురజ్జగ
త్ర్పమథన  తాండవాటన,   ""కారనుత బసవేశ పాహిమాం!
ఢణ  ఢణ  ఢం మృఢం మృఢణ ఢం మృణ ఢంమృణ ఢంఢణో ద్ధణం
ధణ నటన  త్వదీయ డమరూత్థ  మదార్భట  ఢంకృతి  ప్రజృం
భణ త్రుటితాభ్రతార  గణరాజ దినేశముఖగ్రహ ప్రఘ(gha)ర్
క్షణ గుణతాండవాటన  ""కారనుత.  బసవేశ పాహిమాం!
ణణ్మృణ  ణణ్మృణ ణ్మృ ణణ  ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ  ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ విక్రమ జృంభణ సంచలన్నభో
ణ్ణ ణ్మృణ  ది క్క్వణ  ణ్మృణణ  ణణ్మృణ  ణణ్మృణ  ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ  తాండవాటన  ""కారనుత  బసవేశ పాహిమాం!
-మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు
"
అక్షరాంకపద్యముల" నుండి సేకరణ.
నాలుగు పద్యాలు మొదటి ప్రయత్నంలోనే తప్పులు లేకుండా చదువగలిగితే మీరు ఉత్తములు. నాలుగు సార్లు ప్రయత్నించి తప్పులు లేకుండా చదువగలిగితే మధ్యములు. ఎన్ని సార్లు ప్రయత్నించినా తప్పులు లేకుండా చదువలేకపోతున్నారంటే మీరిక ఈజన్మలో తెలుగుభాషను స్పష్టంగా స్వచ్ఛంగా మాట్లాడలేరని హెచ్చరించేవారు మా గురుదేవులు.మీరు కూడా ఓసారి చదవండి.మీ పిల్లలతో వీటిని చదివించండి.మీరందరూ "ఉత్తమ"స్థానంలోనే నిలబడాలని మా కోరిక. (శ్రీశివయోగపీఠం)



.......................
https://www.speakpipe.com/voice-recorder/msg/3fi6iwt0gs75r2fk
.................
https://www.speakpipe.com/voice-recorder/msg/3fi6iwt0gs75r2fk