Friday, 12 August 2016

Thenela thetala matalathoo.........



తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా......

సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు...

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే....

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని...