Tuesday, 26 April 2016

Sakkanni A Telugu folk- చక్కన్ని సరిబండమీనా.......(తీయని జానపదం)

పాతకాలంలో తంగేడి, రేల, చెక్కలు వొలిపించేవారట,


కూలీలతో ! అలా ఆ చెక్క వొలిచే 


 పనిమీద వచ్చిన ఓ చిన్నవాణ్ణి చూసింది,


 పనికొచ్చిన ఓ చిన్నది. 
 


మనసు అతగాని చుట్టూ


 తిరుగుతున్నది. శ్రమ మరచిపొయేందుకనె 


సాకుతో,పాట అందుకుంది. మనసులో మాటా


ఇలా బైటపెట్టింది(సహృదయ,సాంస్కృతిక
 

 సంస్థ, వరంగల్ వారి, దశాబ్ది విశేష సంచికలో



డా. రుక్నుద్దీన్ గారి వ్యాసం


నుండీ-సోదరుడు,



డా. జి. గిరిజా మనోహర్ బాబుగారికి కృతజ్ఞతలతో )
 
  

........................
 
సక్కన్ని సరిబండ మీనా నా సామి..చెక్కదంచే సిన్నదానా...

సెక్కవచ్చి సెంప దాకే నా సామి..సెప్పరాని దుక్కమొచ్చే...

మయదారి బండ మినా నా సామి, మందు దంచే మామ కొడకా..

మందులెలా మాకులెలా నా సామి..మనసులుంటే సాలు పోరా..

తాగేది కైకుంట నీరూ, నా సామి కడవా నిండా నింపుకోనీ

రెండూ సేతులు కడవా మీనా నా సామి వాలూ గన్నులు వాని మీనా...  



Tuesday, 12 April 2016

Ramududbhavincinadu ...A Telugu Devotional on Sreerama Navami


Amba kamakshi...(In Raga- Bhairavi )


పదములు లేవు వేడుటకు పావన మూర్తి!  సుధాంతరంగ! నన్       
  సదమల  బుద్ధితోడ నిట సం యమ జీవన యాత్ర సేయుచూ, 
 వదనము నందు  సంతసము   వాడక  నాదరి నుండనీయరా!   
  పదములనంటి వేడెదను, పాపపుయూహలు లేక రామయా !
,,,,,,,,,,
సుమ హృదయమ్ములోన  బహు సుందర రీతిని జేరి, లీలగా 
  క్రమముగ దోచు తేటివలె రమ్యముగా మది నిల్చినావు,  వి
భ్రమమొనరించి నీవు, శృతి,రాగము, తోడుత   నాదు  భావనల్    
  సుమధుర గాన వాహినిని   సుస్వర మందగ జేయరా ప్రభూ...