Thursday, 15 December 2016

సంధ్యాసమయము
అందముగా నటు

 విరిసిన నింగిని జూడవటే!
 నింగిని విరిసిన
రంగుల  గనియెడి
ప్రమధగణమ్ముల హ్లాదమదే!  
తమ స్వామిని దర్
శించి, తరించి,
మంచిత మనముల దూలుటకై
జయ జయ జయ హే
స్వయంభువా! యని
త్రిలోకములలో  జాటుటకై,
అతల సుతల  విత
ల,తలాతలముల
రసాతలము బ్రకటించుటకై
శితికంఠుని
స్తుతించుటకు సం
సిద్ధములాయెను జూడగదే!
సకల చరాచర
సుఖమును  కొరకై
గరళము ద్రావిన సదాశివా!
అసురుల సంధ్యను
కుశలత నాట్య ప్ర
వంద్యగ  నీవే  మలచితివా!



Tuesday, 13 December 2016


సీసం-పూర్వభాగము

నే కపోతము వోలె నేలకొరిగెదనె

మోహజాలములందు    మోసవోయి

అజగరము  వలె    నే నాహార  వాంచతో

  నహరహము మరతు నాదు స్వామి !   
         
   సరఘనై  బవలురే    సంపద గూర్చుటే

  నా ద్యేయమాయె నే ననఘ దత్త!

ఆతాయి నై నేను యాకసమ్ముననుండి 

నీచ ధనము కేసి నెగరి వత్తు, 

తేటగీతి

మిడుతనై  మాడితిని గోర్కె కొలిమి లోన,

మత్స్యమై నెర జిక్కితి మాయ గాదె?

సర్పమై   విష దం ష్ట్రల సంచరింతు,


గావవే   నన్ను గురువరా!  కరుణ తోడ!   


ఉత్పలమాల 
నీదగు నాదు జీవితము, నీదగు నాదు మనంబు, ధ్యానమున్,


నీ దయ లేనినాడు, ప్రభు, నీరవ చాతక  గీతి  కౌదు,   నీ


బోధనె నాదు సర్వ  భవ  మోహ  విమోచన సూత్రమోమహా

  
వేద స్వరూప! దత్త ప్రభు!  వేగమె గావవె గోరి జేరితిన్.






 తేటగీతి(పంచపాది)
చేతులారంగ దత్తు బూజింపరారె, 
నోరునొవ్వంగ బ్రభు కీర్తి నుడువరారె, 
తలచి దలవంగ నంతటే దయనుగురియు,
మువురు దైవత   రూపమై మోక్షమిచ్చు

దత్త స్వామిని గొల్వరే దత్త మదిని.

Friday, 9 December 2016

20.

 నిన్నెటుల జూతునో నిటలాక్ష! నేనెరుగ,
మన్నించుమని వేడ మాటలే  దోపవుగ,
దొంగలకు దొంగవట, దొరుకుదువ భక్తులకు ?
దొంగవే నీవటగ, దోపదే మనసులకు !  
వంచించువాడవును వంచితుడవూ నీవె,
సంచితములౌ పాప సం హారకుడవీవె, 
కూరుచుందువు నీవె, కునుకు దీతువు నీవె,
తీరు తీరుల  మాట  దీర్చువాడవు నీవె,
ఆడించునది నీవె..యాడువాడవు నీవె !

 ఆడించునది నీవె..యాడువాడవు నీవె 

కబరీ భరముల
సుమ హారమ్ముల
మొగమున నగవుల సొగసులతో
మకరికలందున
మరు రిపుదర్శన
బరవశ మానస సరసిజలూ..

రంభ ఘృతాచీ
మేనక, యూర్వశి,
సుకేశి తిలోత్తమాదులునూ 
మంజుల గతితో
మధురోహలతో
హరి హరు సేవకు గదలుటటే!



యక్షులు,గంధర్
వులు, కిన్నెరలును 
 కింపురుషాదుల  గానవటే?
దివిజుల భూముల
కొలువై యుండెడి
దేవగణమ్ముల పరుగులటే !

(to be continued) 

Thursday, 8 December 2016


శర షట్పద 

ఏమని దెలిపెద 
నీ యానందము
శివ కీర్తన లట! నటు వినవే!
వచ్చెనొ  యేమొ వి
యచ్చర దైవత
మంతయు నిల పై,నటు  గనవే!
నిండుగ వెల్గెడు
దీపావళులను  
శివ చేతనలను విన  రావే!
మెండుగ నృత్య
ప్రవచన గానము
హరి హర విభవము గన రావే!
ప్రాణములో ను
ఛ్వాసములో  జగ
దీశుని దలవని బ్రదుకేలే
సందడి సేయుచు
శివ సంకీర్తన
సుఖమును బొందుటె సొగసౌలే !
కార్తిక శోభలు 
కేదారునకతి 
ప్రియములనుట నీవెరిగితివా
క్షీర సముద్భవ 
దామోదరులకు  
శోభనమౌనట దెలిసితివా
హరి హర భేదము
మదినెంచుటలో 
హరియించిన యుగములు యెన్నో !
ఇరువుర గోపా
లురుగా దెలిసిన
భక్తుల నిజ గాధలు యెన్నో!
వాముండాతడు,
వామనుడీతడు,
వారల భేదము గననేలా?
ఇరువురి  నాట్య వి
భా వైభవమే
జగతి గ దెలియుట వినవేలా?

Tuesday, 6 December 2016






శుద్ధ చైతన్యాది సూక్ష్మ చైతన్యాల  

శుద్ధముగ నిను జూడ సూచింతు  నే జాల,

జీవ, మోక్షము వంటి సేమమగు తత్వాల 

జీవేశ! నీదైన ఛవి  జూడనౌ జాల, 

దివ్య భావములిచ్చి తీపురము దొలగించు,

భవ్య దీక్షల యందు , భవ! నన్ను గరుణించు,

పృధివి మొదలుగ నేడు పృక్తావరణములను 

గ్రధియించు దేవరా! గావు నీ లీలలను..

ఆడులే పరమాత్మ, పాడులే ప్రతియాత్మ

ఆడులే పరమాత్మ, పాడులే ప్రతియాత్మ