Sunday, 20 November 2016
జీవనము విభ్రాంతి జీవనుడవీవెరా
కావమందును నిన్ను, కామారి వీవురా!
రమియింప మనసౌను లలనార్ధ, శంకరా!
నిమిషార్థ సంపదల నిను మరతు నెటులరా!
సిలువలకు దుది లేదు,చిన్మయ జటాధరా!
చలువతో దరి జేర్చు, జడలసికదేవరా!
నటనావతంసుడవు, నను జూడవేలరా!
పటుతరమ్మీ భవము బంధముల గూల్చరా!
పాడులే పరమాత్మ ! ఆడులే ప్రతి యాత్మ!
పాడులే పరమాత్మ ! ఆడులే ప్రతి యాత్మ!
కావమందును నిన్ను, కామారి వీవురా!
రమియింప మనసౌను లలనార్ధ, శంకరా!
నిమిషార్థ సంపదల నిను మరతు నెటులరా!
సిలువలకు దుది లేదు,చిన్మయ జటాధరా!
చలువతో దరి జేర్చు, జడలసికదేవరా!
నటనావతంసుడవు, నను జూడవేలరా!
పటుతరమ్మీ భవము బంధముల గూల్చరా!
పాడులే పరమాత్మ ! ఆడులే ప్రతి యాత్మ!
పాడులే పరమాత్మ ! ఆడులే ప్రతి యాత్మ!
అసుర గుణ చయములవి జేసినవి హుంకృతులు
విసరముల శృతులలో వినవచ్చె ఝంకృతులు
తొలగించగా నంది దోసిట నహంకృతులు
వెలిగినవి హృది వేల్పు వేల
శిఖరాకృతులు
మ్రోగిన వనేకములు రాగముల సంస్కృతులు
యోగి సంసర్గమున యాగ వైభవ కృతులు
పుడమి నిండిరి శివా పురరిపుల స్వీకృతులు
బడబానలము త్రాగు, భర్గుని కలంకృతులు
Saturday, 19 November 2016
ఎగు భుజమ్ముల, వాడి యెసలు జిమ్మెడి వాడు,
నగు మొగమునను చిలిపి నటన జిలికెడి వాడు,
రాగముల నన్నిటిని రక్తి నడిపెడువాడు,
నాగపాశములలో నవత లొలికెడువాడు
గమక నిపుణతజూపి కనులు గీటెడివాడు,
తమకతను తనుజూచు నుమను దచ్చెనలాడు.
అటుజూచి దయబరపి నార్తి బాపెడువాడు,
బటుతరమ్మౌ బాప పాథమార్పెడివాడు
పాడులే పరమాత్మ ఆడులే ప్రతి యాత్మ
,,,,,,,,,,,,,,,,,,,,,
సీసం-పూర్వభాగము
శక్తికి ముక్తికి సత్య సత్వమ్మైన
శాంకరుల పితకు సంస్తవములు
గురుతువెట్టగరాని గుణముల దైవమ !
పొలుపు జిల్కెడి మేటి పొగడికోలు ,
అలవిగానట్టి రాకాసి మూకల ద్రుంచి
నట్టి నభవునికి నతి శతములు
మూడు కన్నులతోను ముక్కోటి దైవాల
శాసించు శూలికి శ్లాఘనములు.
తేటగీతి(పంచపాది)
చూపు ద్రిప్పకుడెటులైన సూక్ష్ము నుండి
మనము నిండార నిలుపగ చంద్ర ధరుని,
పున్నెముల పంటగా నేడు పున్నమాయె
భర్గునీవేళ కొలచిన భవ్యముగను
మెచ్చి కార్తీక కౌముదినిచ్చు సుఖము.
...............................
Tuesday, 15 November 2016
Subscribe to:
Posts (Atom)





